మనం చాలా పేదరికంలో ఉన్నా మనకష్టాలు ఒక్కసారి తీరాలని తపనపడుతున్నాం ఎందుకంటె మన కష్టాలు
అటువంటివి దయచేసి దీన్ని మార్చటానికి ప్రయత్నిద్దాం. ఉదా :- speak asia, ads and ads, cj మొదలగునవి .
మనమేం చెయ్యాలంటే ముందు మనతప్పుని మనం తెలుసుకోవాలి సాద్యమైనంత వరకు మనలా ఇంకొకరు నష్ట పోవటానికి తావివ్వకూడదు. ముందు మనం మన తల్లి తండ్రులు చెప్పింది విని ఆలోచించి తర్వాత మనం నిర్ణయం తీసుకుందాం ఎంతసేపు మనవైపు మాత్రమే ఆలోచించకుండా అవతలివారి వైపు కూడా ఆలోచిద్దాం.మనకు అప్పులుంటే వాటిని టార్గెట్ చెయ్యాలి. అంతే కాని ఏదో పార్ట్ టైంగా వర్క్ చేస్తే 3000 కి 5000 , 10000 కి 40000
వస్తాయని ఆశ పడకూడదు ఇటువంటి వ్యాపారాలు ఎన్నో ఉన్నాయి మరెన్నో వస్తాయి అంత మాత్రాన మనం ప్రయత్నిస్తూ పొతే మనం ఒక ఊబి లో ఇరుక్కుపోతం పోనీ పక్కవాడు లబ్ది పొందాడు మనం కూడా పొందుతాం అని ప్రయత్నిస్తే తప్పులో కాలు వేసినట్లే ఎందుకంటె వాడు లబ్ది పొందాలంటే యెంతోమంది నష్ట పోవాలి. మీరు గమనించండి మీ మనసుకు తెలుస్తుంది ఈ online వ్యాపారాలలో ఎంతమంది నష్టపోతున్నారో గమనించండి.
మధ్యతరగతి కుటుంబాలకు కష్టాలనేవి తప్పవు అవి సునామి లో కొట్టుకు పోవాలె తప్ప మంచి రోజులు నాకు తెలిసినంతవరకు రావు. మనం కష్టపడి పోరాడితే కాని గెలవ లేము.దయచేసి 10 కి 20 ఆసిన్చొద్దు కోరి కష్టాలు తెచ్చుకోవద్దు ఇది నా ప్రయత్నం దీన్ని ఎంతమంది ఆలోచిస్తారో వారికి కచ్చితంగా మంచి జరుగుతుంది.
No comments:
Post a Comment